నల్లగొండ: యూరియా కోసం పడిగాపులు కాసిన మహిళా రైతు ప్రాణాలు విడిచింది. అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు పాతులోతు దస్సి(55) వారం క్రితం రైతు వేదికలో యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోవడంతో కాలు విరిగింది. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు దస్సిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం దస్సిని నల్లగొండలోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేర్పించారు. గత అయిదు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న దస్సి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో, వైద్యులు ఆమెను పరీక్షిస్తుండగానే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఆమె మృతదేహన్ని స్వగ్రామం గోన్యాతండాకు తరలించారు. శనివారం ఉదయం అత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దస్సి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్థానిక బిఆరెస్ నేతలు హెచ్చరించారు.
మరణించిన మహిళా రైతు దస్సి