యాదాద్రి భువనగిరి, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే సఖీ, భరోసా లాంటి కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. షీటీమ్స్లను ఏర్పాటు చేసి మహిళ రక్షణకు పెద్దపీట వేసింది. హింస, వేధింపులకు గురవుతున్న బాలికలు అలా ంటి ఘటనలను ఎలా ఎదుర్కోవాలి.. సామాజిక సమస్యలను అధిగమించాలి.. బాలికల భద్రత తదితర అంశాలపై అవెర్నెస్కు జిల్లా లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్య వేక్షణలో స్నేహిత అనేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గతే డాది మొదటి విడుత విజయవంతం కాగా, ఇప్పుడు రెండోవిడుత కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల చివరి వారంలో నాలుగు రోజులపాటు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో స్నేహిత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రతిబుధవారం స్నేహిత అవగాహన కార్యక్రమం నిర్వ హించారు.మొదటి విడుతలో భాగంగా మొత్తం 17 మండలాల్లో 237 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 16,488 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ సహ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో కూడా బాలికలను చైతన్యపరిచారు. జిల్లా యంత్రాంగం విస్తృతంగా చేపట్టిన కార్యక్రమం మంచి సత్ఫాలితాలను ఇచ్చింది. సోషల్‌మీడియాలో వేధింపులు ఎదురైనప్పుడు దాదాపు 15 మంది బాలికలు బయటకు వచ్చి చైల్డ్ హెల్ఫ్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. స్నేహిత ద్వారా అవగా హనతోనే ఇదే సాధ్యమైందని జిల్లా బాలల రక్షణ అధికారి సైదులు తెలిపారు. ఇబ్బందులు తలెత్తితే 1098, 100 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
స్నేహిత రెండో విడుత జనవరి చివరి వారంలో నాలుగు రోజులపాటు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సారి గతంలో కంటే విభిన్నంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. బాలల భద్రత కోసం తీసుకొచ్చిన ఫోక్సో చట్టంపై మరింత లోతుగా చైతన్యపరచనున్నారు. జిల్లాలోని 17 మండలాల్లోని 251 పాఠశాలల్లో విద్యా ర్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం 40 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, విద్యాశాఖ, ఐసీడీఎస్, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు.
సమాజంలో నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఇది మరింత ఎక్కువ అవుతున్నది. గుడ్ టచ్..బ్యాడ్ టచ్ కాన్సెప్ట్, వేధింపు లు ఎదురైతే ఎలా స్పందించాలో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది అమ్మాయిలను గట్టిగా ప్రతి ఘటించేలా చేస్తుంది. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేసేలా చేస్తుంది. బాలికలకు అవగాహన కల్పించడమే స్నేహిత లక్ష్యం.