ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం సాధించడం ఖాయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణానికి చెందిన బీజేపీ 12వ వార్డు కౌన్సిలర్, 13వ వార్డు బీజేపీ అధ్యక్షుడితోపాటు 100 మంది ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ముక్తాపురానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
భువనగిరి అర్బన్, ఆగస్టు 30 : పట్టణ ప్రగతితో పట్టణాల్లోని ప్రతి వార్డులో బీటీ, సీసీ రోడ్లు, ఇంటింటికి తాగునీటితో పాటు, వార్డుల్లో మౌలిక వసతులు కల్పించబడ్డాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణానికి చెందిన బీజేపీ 12వ వార్డు కౌన్సిలర్ ఊదిర లక్ష్మీసతీశ్, 13వ వార్డు అధ్యక్షుడు నీల రమేశ్‌తో పాటు 100మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్, జంగయ్య పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపురం గ్రామానికి చెందిన 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో బుధవారం చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టి పోలు విజయలక్ష్మీశ్రీనివాస్, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, కౌన్సిలర్ కొంగరి కృష్ణ, మాజీ సర్పంచులు దారెడ్డి మల్లారెడ్డి, మునుకుంట్ల బాలచంద్రం, నాయకులు గుండ్ల హరిశంకర్, కొండమడుగు రోషన్, ఎల్ల స్వామి, రాజిరెడ్డి, రాజ మల్లేశం, వేములు పాల్గొన్నారు.ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితోనే మున్సిపాలిటీ అభివృద్ధి12వ వార్డు కౌన్సిలర్ ఊదరి లక్ష్మీసతీశ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితోనే భువనగిరి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని 12వ వార్డు కౌన్సిలర్ ఊదరి లక్ష్మీసతీశ్ అన్నారు. వార్డు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కరిస్తారని పేర్కొన్నారు.