గుండాలకు చెందిన 22 మంది గ్రూపుగా ఏర్పడి మద్యం దుకాణం కోసం టెండర్ వేశారు. ఇందులో ఓ వ్యక్తికి ఆత్మకూరు (ఎం)లో లక్కీ డ్రాలో వైన్స్ దక్కింది. సదరు వ్యక్తి మద్యం వ్యాపారంతో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే అనుభవం ఉన్న ఓ వ్యాపారికి రూ.82 లక్షలకు విక్రయించారు. వచ్చిన డబ్బును 22 మంది పంచుకున్నారు. 50వేల పెట్టుబడి పెట్టిన వారికి 2లక్షలు, లక్ష ఖర్చు చేసిన వారికి 4 లక్షల చొప్పున లాభం వచ్చింది. దరఖాస్తు వేసిన వ్యక్తికి గుడ్ విల్ కింద అదనంగా 4లక్షలు ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వైన్స్ లైసెన్స్ దారులకు కాసుల పంట పండుతున్నది. మద్యం దుకాణాలకు మస్తు డిమాండ్ పలుకుతున్నది. పాతవారు ఎంతకైనా కొనేందుకు సిద్ధపడుతుండటంతో లైసెన్స్ దారులకు అదృష్టం తన్నుకొస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు రూ. కోటికి పైగా పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలు చోట్ల రూ.80 లక్షలకు ఖరారు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇం కా సమయం ఉండటంతో మరికొన్ని చోట్ల చర్చలు నడుస్తున్నాయి.
చాలా చోట్ల కొత్తవారికే..
జిల్లాలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెఖలారుతో వీటి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25వ తేదీ నుంచి షాపుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 18 చివరి గడువు కాగా.. పలు కారణాలతో మరో మూడు రోజులు పొడిగించారు. షెడ్యూల్ ప్రారంభంలో దరఖాస్తుల స్వీకరణ నెమ్మదించగా.. చివరి ఐదు రోజుల్లో భారీ సం ఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 2776 దరఖాస్తులు స్వీకరించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.88.28 కోట్ల ఆదాయం సమకూరింది. గత నెల 27న కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. అయి తే చాలా చోట్ల మద్యం వ్యాపారానికి సంబం ధం లేని కొత్త వారికి డ్రాలో లైసెన్స్ పొం దారు. వారిలో అతి తక్కువ మంది లిక్కర్ వ్యాపారంపై మొగ్గు చూపుతుండగా..మరికొంత మంది మాత్రం విక్రయానికే ఆసక్తి చూ పుతున్నారు. ఇప్పటికే బిజినెస్‌లో ఉన్న పాత వ్యాపారులు మాత్రం వైన్స్ దుకాణాలు కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వ్యాపారులకు గిట్టుబాటు అవుతుందా?
మద్యం దుకాణాదారులు కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి షాపులు దక్కించుకుంటే.. గిట్టుబా టు అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైన్స్ దక్కించుకోవడంతోనే ఖర్చులు ముగియవు. ఏటా ప్రభుత్వానికి టాక్స్‌ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏరియాను బట్టి రూ.50లక్షల నుంచి కోటికి పైనే ఉం టుంది. వీటితోపాటు మడిగెలు, వర్కర్లు, ఇత ర ఖర్చుల అదనం. అయితే కొందరు మద్యం వ్యాపారులు నకిలీ మద్యం అమ్మి లాభాలు గడిస్తారనే ఆరోపణలు లేకపోలేదు. మామూ ళ్లు ముట్టజెబితే ఆబ్కారీ శాఖ అధికారులు సైతం సహకరిస్తారనే అపవాదు ఉంది. గతం లో జిల్లాలో నకిలీ మద్యం కేసులు నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి.
వైన్స్ కోటికి పైనే!
యాదాద్రి భువనగిరి జిల్లా అధిక శాతం అర్బన్ ప్రాంతంలో ఉండటంతోపాటు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యానికి మస్తు గిరాకీ ఉంటుంది. దీంతో గతంలో ఉన్న వ్యాపారులే మళ్లీ మద్యం దుకాణాలు నడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కొత్త వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేయడంతో అమ్ముకోగా.. వచ్చిన దాంట్లోనే పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కొందరు లైసెన్స్ దారులు కోటిన్నర చెబుతున్నారని, బేరం తర్వాత కోటి వరకైనా వస్తుందనే ఆశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మోత్కూరులోని ఓ వైన్స్‌కు రూ. కోటి వరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భువనగిరి పట్టణంలో 1.20 కోట్ల వద్ద బేరసారాలు కొనసాగుతున్నాయని తెలిసింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో రూ. కోటి వరకు పలుకుతున్నట్లు తెలుస్తున్నది. వైన్స్ ప్రారంభానికి ఇంకా 20 రోజులు సమయం ఉండటంతో లైసెన్స్ దారులు వెయిటింగ్లో పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.