నల్లగొండ: నల్లగొండ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడగొట్టి తరిమేస్తే భువనగిరికి పారి పోయి మళ్లీ ఇప్పుడు నల్లగొండకు వచ్చి ప్రగల్బాలు మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల్ని ప్రజలెవ్వరు నమ్మరని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నల్లగొండను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కోమటిరెడ్డి శాపనార్దాలు పెడుతున్నారని భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.
పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించి, ప్రజలకు సుపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని అన్నారు. ఐటీ మంత్రిగా నల్లగొండకు ఐటీ హబ్ ను తేలేని అసమర్దుడు కోమటిరెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడ్తున్నాయని, ఇప్పుడు వచ్చి నానా హంగమా చేస్తే ప్రజలు ఎవ్వరు నమ్మరని భూపాల్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు,పట్టణాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయని, ఏ ఊరికి పోయినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు నమ్మరని భూపాల్ రెడ్డి అన్నారు.