కోదాడ, జనవరి 13 : ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో మోతె మండలంలోని పలు పార్టీలకు చెందిన 20 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారు సభ్యత్వం తీసుకుని ప్రమాద బీమా పొందాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వర్రావు, యూత్ అధ్యక్షుడు పాషా, నాయకులు మిక్కిలినేని సతీశ్, నవీల, రామకోటి, సర్పంచులు నూకల శ్రీనివాస్‌రెడ్డి, కోటేశ్, పురుషోత్తమరావు, ఎంపీటీసీ విద్మావతీవెంకట్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.