చండూరు, మార్చి 26 : జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారథిలా పనిచేసే జర్నలిస్టులు నిత్యం ఒత్తిడి, సవాళ్లను ఎదర్కోవాల్సి ఉంటుందన్నారు. వారికి ఆరోగ్య రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరుల ఇళ్ల స్థలాల విషయమై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించినట్లు తెలిపారు.
భారతదేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే- ఐజేయూ అన్నారు. జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం ఇచ్చే పిలుపులో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అన్ని రకాల కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అందుకు రాష్ట్ర సంఘం నుండి అన్నివేళలా అండదండలు ఉంటాయని చెప్పారు.
జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ,
జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, దోటి శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి కేసాని శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.యాదగిరి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, వి.చంద్రశేఖర్ రెడ్డి, వి.వెంకట్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకల వంశీ, రాపోలు ప్రభాకర్, సంగేపు మల్లికార్జున్, నల్ల స్వామి, ఆడెపు శంకర్, సంగేపు మల్లేశ్, రవీంద్ర చారి, ఆకుల రఘుమయ్య, ముత్యాలు, ముడుపు శ్యామ్ రెడ్డి, మహేశ్వరం సతీశ్, వెంకన్న, నక్క శ్రీనివాస్, ఇడం గణేశ్, జక్కల నాగరాజు, దోటి లింగస్వామి పాల్గొన్నారు.