మిర్యాలగూడ, ఫిబ్రవరి14 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 150 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పంట పెట్టుబడికి ఎకరాకు 10 వేలు అందించి అన్నదాతలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు చనిపోతే రైతుబీమా ద్వారా 5 లక్షల రూపాయలు అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలకు వివిధ పార్టీలకు నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరినవారిలో పలస సుధాకర్, కుసుమ లింగారెడ్డి, భద్రారెడ్డి, దుర్గయ్య, లక్ష్మారెడ్డి, నారబోయిన వెంకన్న, సైదులు, తిరుపతయ్య, అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వేములపల్లి మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మిర్యాలగూడ వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, నాయకులు ఇరుగు వెంకటయ్య, పేరాల కృపాకర్‌రావు, చిర్ర మల్లయ్యయాదవ్, ఉత్తెర్ల వెంకటేశ్వర్లు, దినేశ్, రామచంద్రు, వెంకన్న పాల్గొన్నారు.