చండూరు, ఏప్రిల్ 05 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని నల్లగొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా చైర్మన్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కురుపాటి గణేశ్‌తో కలిసి శనివారం చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాసాల పాండురంగారెడ్డి, భూతరాజు యాదయ్య, తీగల చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కట్కూరి రంగారెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కురుపాటి శ్రీను, ఎలవర్తి శ్రీను, తీగల కృష్ణయ్య, అనుమల్ల యాదయ్య, కురుపాటి చిన్న నాగేశ్ పాల్గొన్నారు.