నేరేడుచర్ల, జూన్ 10 : నేరేడుచర్ల మండలం ఫత్తెపురం గ్రామ శివారులోని అంబేద్కర్ కమిటీ హాల్‌కు కేటాయించిన స్ధలాన్ని కొంతమంది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని గ్రామ అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో మంగళవారం నూతన బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణం కోసం గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మచ్చ గురుమూర్తి, మచ్చ పెద్ధశ్రీను, నగేశ్, మారయ్య, సతీశ్, వెంకటేశ్, ఉపేందర్, కరుణాకర్, అంజయ్, సుధాకర్, సైదులు పాల్గొన్నారు.