పెన్‌పహాడ్, ఆగస్టు 7: పెన్‌పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ కమిటీ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్యా జ్యోతి విస్త్రతంగా పర్యటించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రాజేశ్‌తో కలసి ఓపీ, ఆపరేషన్ గది, మందులు ఇచ్చే గది, రోగుల గదులను పరిశీలించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ 3, అంగన్వాడీ 1 సెంటర్లను పరిశీలించి ఆట వస్తువులు పిల్లల దగ్గర ఎందుకు లేవని అంగన్వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మలు చూపించి చిన్నారులను ఇవి ఏ బొమ్మలని అడగ్గా చిన్నారులు చెప్పకపోవడం, ఆటపాట ల్లో చురుకుగా లేకపోవడంతో చిన్నారులకు ప్రతిరోజూ మీరు ఏం చెబుతున్నారని ప్రశ్నించారు. చిన్నారులపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాలను,నాణ్యతలేని గుడ్లను పరిశీలించి పిల్లలకు నా ణ్యమైన భోజనం పెట్టి మెనూ పాటించాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించి ప్రధానోపాధ్యాయులు మ ల్లారెడ్డితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కమిషన్ కమిటీ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ..ప్రైవేట్ బడులకు పిల్లలు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, డీఆర్డీఏ పీడీ అప్పారావు, సివిల్ సైప్లె అధికారి ప్రసాద్, హౌసింగ్ బోర్డు అధికారి మోహన్‌రావు, డీటీవో శంకర్రావు, డీడబ్ల్యువో దయానందరాణి, ఐఎన్పీఆర్ మల్లేశ్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, ఐసీడీఎస్ సీడీపీవో కిరణ్మయి, మండల వైద్యాధికారి రా జేశ్, ఎంఈవో రవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయచంద్రిక, ఉపేంద్ర, అని షా, స్వప్న, ప్రధానోపాధ్యాయులు మ ల్లారెడ్డి, సునీత, అంగన్వాడీ టీచర్లు విజయ, ఊర్మిళ పాల్గొన్నారు.