తుంగతుర్తి, జులై 01 : కుల వృత్తిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతన్నలను రోడ్డున పడేసిందన్నారు. కుల వృత్తిదారుల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని గౌడన్నలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. కుల వృత్తుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ వచ్చేది వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వంలో గౌడన్నలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నారం గౌడ సొసైటీ అధ్యక్షుడు వెలిశాల వెంకటరత్నం, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు వర్ధల్లి లింగయ్య, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మద్దెల నరసయ్య, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేశ్, వెలిశాల శేఖర్, నలమాస హుస్సేన్, శ్రీహరి, వెలిశాల యాకన్న, గుండగాని రాము, గోపగాని లింగమూర్తి, గౌడ కులస్తులు పాల్గొన్నారు.

కుల వృత్తిదారులను ఇబ్బంది పెడితే ఊరుకోం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్