నల్లగొండ : దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని 12వ వార్డులో రూ.7లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పనులకు, రూ.10లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు, రూ.18లక్షలతో నిర్మిస్తున్న SC శ్వాశన వాటిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రశంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.4కోట్లతో బేలమోని కుంట అభివృద్ధి చేవామన్నారు. రూ. 50 లక్షలతో 11,12వ వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి అని ఆయన గుర్తు చేశారు.
పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ షాగుఫానాజ్ ఇలియస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, తౌఫిక్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.