కట్టంగూర్, డిసెంబర్ 19 : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
రాష్ట్రంలో 80 లక్షల నుంచి కోటి మంది వరకు వ్యవసాయ పనిచేసే కార్మికులకు సొంత ఇళ్లు లేక కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యవసాయ కూలీలు, కార్మికుల విషయంలో ప్రభుత్వాలు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కూలీలకు కూలి రేటు, రైతులకు మద్దత ధర అందక తీవ్రంగా నష్టపోతున్నాని పేర్కొన్నారు. సమావేశానికి ముందు మహాసభల సూచికగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు పతాకావిష్కరణ చేశారు.
సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయి లయ్య, జిల్లా అధ్యక్షుడు బొజ్జ చినవెంకులు, పెంజర్ల సైదులు, కక్కిరేణి రామస్వామి, మురారి మోహన్, రమేశ్, సరోజ, లింగస్వామి, భిక్షం, మారయ్య, రవినాయక్, సైదులు పాల్గొన్నారు.