మునుగోడు, మే 1 : క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులో గల అధికారిక క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు క్షయ నిర్మూలన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.
క్షయ పరీక్షలు, మందులు ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపారు. కావునా వ్యాధి లక్షణాలు ఉన్న పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి లేని నియోజకవర్గంగా మునుగోడును నిలిపేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మునుగోడు మెడికల్ ఆఫీసర్ నర్మదా, మెడికల్ సిబ్బంది మంగ్లీ బాయ్, అజయ్, సైదులు, ధనమ్మ, అధికారులు పాల్గొన్నారు.