‘ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి’
వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. గురువారం ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని...
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 10 : వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. గురువారం ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హనుమాన్ పేటలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేత, అన్యాయానికి ఎదురు నిలిచిన తెలంగాణ పోరాట వీర వనిత ఐలమ్మ అన్నారు. సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని, తెగువను అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన నాయకులు తుపాకుల తుకారాం, రజక తాడూరి సైదులు, రజక యర్రబెల్లి వెంకన్న, రజక సామాజికవేత్త ఉద్యమకారుడు ఎండీ మహమ్మద్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

