దేవరకొండ, అక్టోబర్ 15 : గర్భిణీలు, బాలింతలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పోషక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని తిరుపతి తిరుమల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోషక మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషక మాసాన్ని నిర్వహించి గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని కోరారు. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, వత్యా దేవేందర్ నాయక్, వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ జానీ యాదవ్, తిప్పర్తి రుక్మారెడ్డి, గోపాలరావు, కుర్ర రామ్ సింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ పాల్గొన్నారు.