నిడమనూరు, జూలై 31 : నిరుపేదలకు ఆపన్న హస్తం అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుండాలని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-1 కె.వి ప్రసాద్ అన్నారు. నిడమనూరు మండలంలోని శాఖాపురం సాయి ఫంక్షన్ హాల్లో గురువారం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా చేయూతనందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ముందుకు సాగాలన్నారు.
అనంతరం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు బెలిదె అశోక్, కార్యదర్శి చిత్రం అశోక్, కోశాధికారి వంకా బ్రాహ్మన్న, వైస్ చైర్మన్ గండికోట యాదగిరితో పాటు సభ్యుల చేత వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 కోడె సతీశ్ కుమార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ చైర్మన్లు చేకూరి హనుమంతరావు, పోలె డేవిడ్, పాంపాటి శ్రీనివాసులు, అంకతి సత్యం, ఉన్నం చిన్న వీరయ్య, నేతాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.