తుంగతుర్తి, మే 16 : కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మారోజు వీరన్న కూతురు మారోజు దిశ కోరారు. శనివారం ఆయన 27వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఆయన స్తూపం వద్ద పలు సంఘాల నేతలు, రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మలి దశ తెలంగాణ పోరాటానికి ఊపిరి పోసిన విప్లవ శ్రామికుడు కామ్రేడ్ మారోజు వీరన్న కొనియాడారు. వీరన్న విద్యార్థి దశ నుండే విప్లవ పాఠాలు నేర్చుకుని దళిత బహుజన వర్గాల ప్రజలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఎన్నో పోరాటాలు చేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, న్యాయవాదులు వీరేశ్ నాయక్, భాషబోయిన వేణురాజ్ యాదవ్ పాల్గొన్నారు.

‘కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధనకు కృషి చేయాలి’