రామగిరి, జనవరి 14 : చెడు నశించి మంచి జరగాలని, పాతను మరిచి అంతా నూతన భవిష్యత్ వైపు అడుగులు వేయాలని భోగి పండుగ సూచిస్తుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నేడు భోగి పండుగ సందర్భంగా నల్లగొండ పట్టణం న్యూ వీటీ కాలనీలో గల ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు, కాలనీవాసులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ భోగి వేడుకలు జరుపుకున్నారు. అందరూ పాటలు పాడుతూ భోగి మంట చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, గంజి రాజేందర్, శ్యాంసుందర్, రాపోలు వెంకటేశ్వర్లు, బిపంగి కిరణ్, రేగట్టే మహేందర్ రెడ్డి, తుమ్మల గోవిందరెడ్డి పాల్గొన్నారు.

Ramagiri : పాతను మరిచి నూతన భవిష్యత్కై అడుగులేయాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి