ఎల్లుండి మూసీ కాల్వకు నీటి విడుదల
ఈ నెల 18 నుంచి మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ భద్రూనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేతేపల్లి, జూలై 15 : ఈ నెల 18 నుంచి మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ భద్రూనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువన సీజన్ ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు జూన్ ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకుంది. దాంతో జూన్ మొదటి వారం నుంచి ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలకు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ తెలిపారు. నాలుగు తడులుగా ఆన్-ఆఫ్ పద్ధ్దతిలో వానాకాలం సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో… మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 100.83 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 642.00 అడుగులు(3.69 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

