కట్టంగూర్, ఏప్రిల్ 18 : వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మండల కేంద్రంలో గామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఆయన ప్రత్యేక అధికారి సతీష్, స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులు, ప్రజలు, వ్యాపారస్తులకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు చలి వేంద్రాన్ని కొనసాగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు యర్కల శశి, ఏనుగు సైదులు, అయితగోని సైదులు, ముషం లావణ్య ఉమేష్. అయితగోని సైదమ్మ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.