కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి పోసవద్దని, ఎన్నికలు కాకముందే ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడే నాయకులతో ఏమీ కాదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి, సుస్థిర పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని అన్నారు.
వలిగొండ, నవంబర్ 22 : మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పహిల్వాన్పూర్, టేకులసోమారం, ఏదుళ్లగూడెం, ప్రొద్దటూర్, మాందాపురం, కంచనపల్లి, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, అక్కంపల్లి, నాతాళ్లగూడెంలో ఎనినకల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తునట్లు చెప్పారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోస పోవద్దని, ఎన్నికలు కాకముందే ఆ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాట మొదలైందన్నారు.
అంతర్గత కుమ్ములాటలే కాంగ్రెస్ సంస్కృతని, ఎన్నికలోచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షురాలు పనుమటి మమతానరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, రేపాక ప్రదీప్‌రెడ్డి, వంగాల వెంకన్న, మొగుళ్ల శ్రీనివాస్, కుపూరి కవిత, కొమిరెల్లి సంజీవరెడ్డి, ముద్దసాని కిరణ్‌రెడ్డి, కీసర్ల సత్తిరెడ్డి, సోలిపురం సాగర్‌రెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, గరిసె నర్సమ్మ నర్సింహ, చేగూరి భారతమ్మ, మోటె నర్సింహ, గుడిసె రాజేశ్వరీనర్సింహ, మాద శంకర్‌గౌడ్, పల్సం రమేశ్, డేగల పాండరి, కుసంగి రాములు, బద్దం సంజీవరెడ్డి, గూడూరు నర్సింహారెడ్డి, కొమిరెల్లి బాల్‌రెడ్డి, ఎంపాల జాన్‌రెడ్డి, సోలిపురం దేవేందర్‌రెడ్డి, రేపాక సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.