అర్వపల్లి, సెప్టెంబర్ 11 : తాగునీరు అందివ్వాలని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వాసులు గురువారం నిరసన తెలిపారు. గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ప్రజలు విసిగెత్తి గురువారం గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ ముందు నిరసనకు దిగారు. వాటర్ ప్లాంట్ ఎందుకు బంద్ పెట్టారని అధికారులను అడుగగా పంచాయతీకి నిధులు లేకపోవడమే కారణమని చెప్పి చేతులెత్తేశారు. తక్షణం వాటర్ ప్లాంట్ను బాగు చేసి తాగునీరు అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.