శాలిగౌరారం, జూన్ 18 : పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శాలిగౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామం నుంచి బండమీదిగూడెం వరకు ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆ గ్రామానికి వెళ్లే స్కూల్ బస్సులు, ఆటోలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో గ్రామంలోని యువకులు, ట్రాక్టర్ డ్రైవర్స్, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్డును తామే బాగుచేసుకున్నారు. గుంతల్లో మొరం పోసి చదును చేసుకున్నారు.