కొండమల్లేపల్లి, నవంబర్ 07 : గ్రామ పోలీస్ అధికారులు ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్, సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు.
ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమస్యలను తీర్చాలన్నారు. స్టేషన్ పరిధిలో సీసీ టీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, జూదం వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుడ లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు.

Konda mallepally : గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమవ్వాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

Konda mallepally : గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమవ్వాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్