చండూరు, సెప్టెంబర్ 13 : గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండడానికి ప్రభుత్వం చండూరు మండలంలోని 8 క్లస్టర్లకు 8 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించిందని తాసీల్దార్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇడికుడ క్లస్టర్ (ఇడికుడ, బోడంగిపర్తి, సిరిదేపల్లి, కుమ్మందానిగూడెం) – బుట్టి శంకరయ్య, బంగారిగడ్డ క్లస్టర్ (బంగారిగడ్డ,తుమ్మలపల్లి) – షేక్ రిజ్వాన్ బాబా, కస్తాల క్లస్టర్ (కస్తాల, ఉడతలపల్లి) – బీరెల్లి యాదయ్య, చండూరు క్లస్టర్ (చండూరు) – కట్ట వెంకట నారాయణరెడ్డి, పుల్లెంల క్లస్టర్ (పుల్లంల, కొండాపురం) – నాతి రమేశ్, అంగడిపేట క్లస్టర్ (అంగడిపేట, గుండ్లపల్లి) – పురం వెంకటేశ్వర్లు, చామలపల్లి క్లస్టర్ (చామలపల్లి) – బైరి శ్రీనయ్య, దోనిపాముల క్లస్టర్ (దోని పాముల, నెర్మట) – పెరిక విజయ్ కుమార్ నియమితులైనట్లు తాసీల్దార్ వెల్లడించారు.