దేవరకొండ రూరల్, జూలై 01 : బీఆర్ఎస్ కార్యకర్త, దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఇంద్రోజ్ విక్రమ్ చారి మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతిచెందిన విక్రమ్ చారి మృతదేహాన్ని మంగళవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన విక్రమ్ చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సోనగంటి గోవర్ధనాచారి, రామలింగం, మర్రు రామారావు, రమావత్ కొండల్ నాయక్, బొడ్డుపల్లి కృష్ణ, సిమర్ల కృష్ణ యాదవ్, వీరమల్ల వెంకటయ్య, సోనగంటి కొండల్ చారి, రమావత్ మాంత్య నాయక్ ఉన్నారు.