
మిర్యాలగూడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పదం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు.15వ ఆర్థిక సంఘం జడ్పీటీసీ నిధుల నుంచి ప్రతి పాఠశాల కు రూ.1.25 లక్షల విలువ చేసే సైన్స్, గణిత పరికరాలను అందజేసి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణం గా తరగతి గదినే ప్రయోగశాలగా మార్చి, ప్రతి విద్యార్థిలో ఆధునిక ఆలోచనలు రేకెత్తే విధంగా పాఠ్యాంశాలను ప్రయోగా త్మకంగా బోధించాలని, సైన్స్ పరికరా లను వినియోగించి విద్యార్థులను సైంటిస్టుగా మలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
200 మంది విద్యార్థుల సంఖ్య దాటిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి, మౌలిక వసతులకు తన నిధి నుంచి రూ.లక్ష కేటాయిస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో గత సంవత్సరం పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మూత్ర శాలల ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు వెళ్లడించారు.అనంతరం ఎంఈవో బాలాజీ నాయక్ మాట్లాడుతూ 1.25 నిధుల్లో రూ.50 వేలు సైన్స్, గణిత పరికరాలకు, రూ.50 వేలు రంగులు వేసేందుకు, మైనర్ రిపేర్లకు, రూ.25 వేలు శానిటేషన్‌కు వినియోగిం చాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళ, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఇన్చా ర్జి ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చెన్ను భరద్వాజ్, పీఆర్ ఏఈ చిల్లంచర్ల ఆదినారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, టీఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, దయాకర్‌రెడ్డి, లావూడి శ్రీహరి, సైదులు పాల్గొన్నారు.