గుర్రంపోడు, మార్చి 21 : గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ జాల పెద్ద సత్తయ్య ఆధ్వర్యంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. టిటిడి దేవస్థాన వేదాగమ పండితులు వేదాక్షర సరస్వతి, వేదాగమ సార్వభౌమ బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రమణ్య దీక్షితావధాని, ఆలయ అర్చకులు వట్టికోట శ్రీనివాస శర్మ, మోపోజు కిరణ్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం గ్రామ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు.
జాల పెద్ద సత్తయ్య ఆద్వర్యంలో శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటక ప్రదర్శన కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు గాలి రవికుమార్ గౌడ్, గాలి సరిత, సర్పంచ్ జాల యాదయ్య, వైస్ చైర్మెన్ వెలుగు భిక్షం, ఉప సర్పంచ్ మేకల కోటిరెడ్డి, కమిటీ సభ్యులు పోలేపల్లి భద్రయ్య, రావుల సైదులు గౌడ్, మేడి వెంకన్న, మోపూరి ఆచారి, తడకమళ్ల అంజయ్య, గంగసాని యాదయ్య, వెలుగు జలేందర్, కమతం శ్రీనివాస్ రెడ్డి, ఇటికాల శేషయ్య, జాల నర్సింహ్మ, పోలేపల్లి నర్సింహ్మ, పగిళ్ల రాజశేఖర్, వద్దిరెడ్డి నర్సింహ్మరెడ్డి, వెలుగు సత్యనారాయణ, పోలేపల్లి రవి, మల్లోజు సంతోష్, బైరు మధు పాల్గొన్నారు.