తుంగతుర్తి, ఏప్రిల్ 12 : ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చిత్తలూరు వెంకట్రామ నరసమ్మ శనివారం తెలిపింది.
ప్రతి విద్యార్థి లక్ష్య సాధనతో కష్టపడి చదివితేనే విజయం సాధించగలరన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాలకుర్తి ఎల్లయ్య, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, బండారు భవాని, నిమ్మనబోయిన నవీన, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, ఇండ్ల ఆంజనేయులు, మాలోతు కృష్ణ, శీలోజు రమాదేవి పాల్గొన్నారు.