గట్టుప్పల్, అక్టోబర్ 16 : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్- 14 వాలీబాల్ విభాగంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి జట్టు నుండి గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి దోటి బన్నీ మంచి ప్రతిభ చూపి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుగ్గ రాములు విద్యార్థిని అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లింగయ్య, దేవదాసు, చారి, మల్లయ్య, జబూన్నిసా బేగం, మల్లేష్, సుమా, కొండ పరమేశం పాల్గొన్నారు.