నల్లగొండ : జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసులలో ఉన్న వాహనాలను వేలం వేయనున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులలో ఉండి వాటి యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రం (డిటిసి)కి తరలించినట్లు తెలిపారు.
మొత్తం జిల్లా వ్యాప్తంగా 853 వాహనాలను వేలం వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వాహనాలకు సంబందించిన పూర్తి వివరాలను జిల్లా పోలీస్ శాఖ అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పొందుపర్చినట్లు వివరించారు. వాహనాల యజమానులు, ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని, లేనట్లయితే వాటిని వేలం వేస్తామని తెలిపారు.
ఇతర వివరాల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం ఆర్.ఐ. శ్రీనివాస్ (9440700078), వెల్ఫేర్ ఆర్.ఐ. నర్సింహా చారి (8499908194) లను సంప్రదించాలని ఆయన సూచించారు.