మర్రిగూడ మండలం వట్టిపల్లి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా వట్టిపల్లి సర్పంచ్ కల్లు స్వాతీనవీన్ రెడ్డి అవార్డు స్వీకరించారు.
మర్రిగూడ, సెప్టెంబర్ 15 : మండలంలోని వట్టిపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2013 అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గురువారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా వట్టిపల్లి సర్పంచ్ కల్లు స్వాతీనవీన్ రెడ్డి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును అందుకున్నారు.కాగా బుధవారం కలెక్టరేట్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ స్వాతి అవార్డును అందుకున్నారు.కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు, ఎం పీఓ యూసుఫ్, పంచాయతీ కార్యదర్శి అక్షిత, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్లు శంకర్ బాబు, మోహినోద్దిన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
బీబీనగర్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామం జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా సర్పంచ్ వసుమతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎంపీడీఓ శ్రీవాణి, కార్యదర్శి బాలలక్ష్మి పాల్గొన్నారు