చండూరు డిసెంబర్ 07 : నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో బిజెపి, బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కల సునంద ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 ఏండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో మునుగోడు మాజీ శాసనసభ్యుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో బోడంగిపర్తి నుంచి చొల్లేడు వరకు 3 కోట్ల 25 లక్షలు, బోడంగిపర్తి నుండి పుల్లముల వరకు 2 కోట్ల 75 లక్షలతో బీటీ రోడ్డు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించమన్నారు.
గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వివిధ రకాల సంక్షేమ పథకాలతో పాటు 65 లక్షల సిసి రోడ్లు, 15 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కోటి యాభై లక్షల చెక్ డాం వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. అలాగే 20 లక్షల రూపాయల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టదన్నారు. గ్రామంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రూపాయి తెచ్చిందో చెప్పి ఓటు అడగాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గెలిపిస్తే ఏమి నిధులు తెస్తారని ఎద్దేవా చేశారు. గ్రామం అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం, ఎమ్మెల్యే ఉండనక్కర్లేదని గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధుల కోసం అధికారం ఉన్నా లేకున్నా కొట్లాడి తెప్పిస్తామన్నారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులు అధికార పార్టీ ఉందా లేకున్నా అందరికి వస్తాయని తెలిపారు. సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పాటు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, రిమోట్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నానని మీరు ఓటు వేసే బ్యాలెట్ పత్రంలోలో వరస సంఖ్య 6 పై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించాలి కోరారు.