కట్టంగూర్, జూలై 17 : కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గాదేవి వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో దుర్గాదేవికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం వారాహి సహిత అష్టమాతృక పూజ, కుంకుమార్చనలు, సాయంత్రం వారాహి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ నెల 25 వరకు వారాహి నవరాత్రులను పురష్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడవేరు మల్లికార్జున్ కృష్ణవేణి, రాపోలు వెంకటేశ్వర్లు లక్ష్మీ, చెవుగోని సైదులు లక్ష్మీ, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ, దంపతులతో పాటు ఇల్లెందుల మణెమ్మ, గుడిపాటి పద్మ. గుండు రూప, బండారు నాగమణి, పోగుల పూలమ్మ, మూడుదుడ్ల అండాలు, దేవులపల్లి అంజమ్మ, కోమటి సుశీల, చంద్రకళ, ప్రవళిక పాల్గొన్నారు.