అర్వపల్లి, అక్టోబర్ 08 : అర్వపల్లి, జాజిరెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. గర్భిణీలు, పిల్లలకు సకాలంలో అన్ని రకాల వ్యాక్సిన్లు వేయాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఆయన వెంట డాక్టర్ భూక్య నగేష్ నాయక్, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, డాక్టర్ ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, మాధవి, చొక్కయ్య, అనూష, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.