గరిడేపల్లి, సెప్టెంబర్ 26: రోడ్లను నాణ్యత గా..వేగవంతంగా నిర్మించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గరిడేల్లి మండలం గానుగబండ, కల్మల్చెర్వు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శంకుస్థ్ధాపన చేశారు.
గానుగబం డ నుంచి పరెడ్డిగూడెం వరకు రూ.1.40 కోట్లతో 2 కి.మీ, గానుగబండ నుంచి హనుమంతలగూడెం వరకు రూ.3.5 కోట్లతో 5 కి.మీ, కల్మల్చెర్వు నుంచి దిర్శించర్ల-చెవ్వారిగూడెం వరకు రూ.3.5 కోట్లతో 4.6 కి.మీ, కల్మల్చెర్వు నుంచి గానుగబండ వరకు రూ. 2.8 కోట్లతో 4 కి.మీ, కల్మల్చెర్వు నుంచి పాలకవీడు సబ్‌స్టేషన్ వరకు రూ.4.2 కోట్ల తో 6 కి.మీ, కల్మల్చెర్వు నుంచి బొత్తలపా లెం వరకు రూ.3.5 కోట్లతో 5 కి.మీ, కల్మల్చెర్వు నుంచి సోమ్లాతండా వరకు రూ.84 లక్షలతో 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థ్ధాపన చేశారు. అనంత రం దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు.
ప్రజలందరికీ బతుకమ్మ, దస రా శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, పంచాయతీ ఈఈ వెంకటయ్య, తహసీల్దార్ కవిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పైడిమర్రి రంగనా థ్, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మూలగుండ్ల సీతారాంరెడ్డి, గుండు రామాంజిగౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు చామకూరి రజిత, మాజీ ఎంపీటీసీ బాల్దూరి సందీప్, పాకాల రమేశ్, పెండెం ముత్యాలుగౌడ్, షేక్ చాంద్‌మియా, కృష్ణారెడ్డి, సైదానాయక్, కోటిరెడ్డి, చిరంజీవి, నాగరాజు నాయక్, నాగేందర్నా యక్, ఎస్ఐ చలికంటి నరేశ్ పాల్గొన్నారు.