పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 13 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. అంగడిపేట స్టేజీ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని రకాలుగా బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి చెందిందన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, నాయకులు సుధాకర్, కర్నాటి రవికుమార్ మహేందర్, దామోదర్, రాయినబోయిన శ్రీనివాస్, అర్వపల్లి నర్సింహ, ఎర్ర యాదగిరి పాల్గొన్నారు.