అర్వపల్లి, సెప్టెంబర్ 1 : యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రైతాoగానికి యూరియా అందించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మండలంలో స్థానిక సమస్యలపై సిపిఎం పోరుబాటలో భాగంగా జాజిరెడ్డిగూడెం గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న అయన మాట్లాడుతూ.. రైతల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను నివారించాలన్నారు.
అదే విధంగా జాజిరెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో గ్రామ ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయాలన్నారు. గ్రామంలో పారిశుధ్య లోపంతో దోమల బెడద పెరిగిందని, వెంటనే అధికారులు పారిశుధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సర్వే కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాసు, శిగ వెంకన్న, విజయకుమార్, రవి కుమార్, వీరయ్య, గంగయ్య, రవి, శేఖర్, శ్రీకాంత్, ఇందిరమ్మ, నాగమ్మ, పిచ్చమ్మ పాల్గొన్నారు.