కట్టంగూర్, ఆగస్టు 28 : రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్‌కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు. పాస్‌బుక్స్‌ను సీరియల్లో పెట్టి 440 బస్తాలకు గానూ 200 మంది రైతులు తమ పేరన్లు సీరియల్ ప్రకారం నమోదు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల పహారాలో సింగిల్ విండో సిబ్బంది రాంబాబు, సైదులు, యాదగిరి, సైదమ్మ ఒక్కో రైతుకు భూమి విస్తీర్ణం బట్టి 2 నుంచి 3 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. శుక్రవారం మరో లారీ లోడు యూరియా వస్తుందని ప్రతి రైతుకు అందజేస్తామని ఏఓ గిరి ప్రసాద్ తెలియజేయడంతో యూరియా దొరకని రైతులు నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.