– సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
సూర్యాపేట, ఏప్రిల్ 14 : తాను పుట్టి పెరిగిన తన 9వ వార్డు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల వాంచ అని అది నేటితో సఫలమైందని అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో అంబేద్కర్ నగర్ పేరు సార్థకమైందని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా 9వ వార్డు అంబేద్కర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కౌన్సిలర్ బండారు మంగమ్మ వెంకన్నతో కలిసి సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు.
కౌన్సిలర్ గా గెలిచిన తనకు జనరల్ స్థానంలో చైర్‌పర్సన్‌గా బాద్యతలు అప్పగించిన అభినవ అంబేద్కరుడు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తూ ఆయన అడుగుజాడల్లో నడువడమే అంబేద్కర్‌కు మనమిచ్చే గొప్ప నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ ఇందుశ్రీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు దుబ్బాక సుదర్శన్, ఉపాధ్యక్షులు కొచ్చర్ల శివ, దుబ్బాక జానీ, దుబ్బాక రాజు, అనుముల పరి రాంబాబు, కొచ్చర్ల మహేష్, పగడాల క్రాంతి, అనుములపురి జానకిరాములు, మద్దూరి కుమార్, అనుములపురి నాగరాజు, నిమ్మ ఇంద్రయ్య పాల్గొన్నారు.