కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దహనం
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి, ఆయన కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రామన్నపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిట్యాల భువనగిరి రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రామన్నపేట, మే11: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి, ఆయన కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రామన్నపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిట్యాల భువనగిరి రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా నిలు స్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బందెల రాములు, కం భంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, వేమవరపు సుధీర్‌బాబు, కన్నెబోయిన బలరాం, పులిపలపుల వీరస్వామి, అంబటి రవీందర్‌రెడ్డి, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, ఎస్కే చాంద్, పున్న వెంకటేశం, మిర్యాల మల్లేశం, జాడ సంతోశ్, ఆమేర్, ముసాబ్, బాసాని రాజు, కూనూరు మత్త య్య, మామిండ్ల అశోక్, రేఖ యాదయ్య, గంగుల రాఘవరెడ్డి, బైకాని మహేశ్, బొడ్డుపల్లి రాజు, నక్క నరేందర్, ఆవుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

