సూర్యాపేట రూరల్, నవంబర్ 15 : న్యూ ఖమ్మం హైవే పిల్లలమర్రి సమీపంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కలకలం రేపింది. ముఖంపై ఆసిడ్ పోసిన గుర్తులు, పెట్రోల్ తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నం జరిగింది. మృతుడు 50-55 సంవత్సరాల మధ్య వయస్కుడు. సమాచారం అందుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో యాసిడ్ డబ్బా లభించింది. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.