నల్లగొండ సిటీ, మే 21 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.