కట్టంగూర్, అక్టోబర్ 16 : సీపీఆర్ (కార్డియా పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడగలుగుతామన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్‌కు సమాచారమిస్తునే వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వివి.నర్సింహ్మరావు, ఎంఈఓ అంబటి అంజయ్య, ఏఎన్ఎ ఎం.వరలక్ష్మి, ఉపాధ్యాయులు కొంక అంథోని, ఎంఏ.గపూర్ పాల్గొన్నారు.