శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు అని, తన మాధుర్యంతో సంగీతం అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తిని కలిగించిన గొప్పవ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్యాగరాజ ద్విదశాబ్ది ఆరాధనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాదోపాసన ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు అని, కర్ణాటక సంగీతానికి, త్యాగరాజుకు విడదీయరాని బంధం ఉన్నదని అన్నారు. ఈ సందర్బంగా పలువురు విద్వాంసులను మంత్రి సన్మానించారు. అంతకుముందు మంత్రి సద్దుల చెరువు మినీట్యాంక్‌బండ్‌ను సందర్శించి వాకర్స్, విజిటర్స్‌తో మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై ఇంకా కావాల్సిన సౌకర్యాలు, లోపాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్‌బండ్ పక్కన మహా ప్రస్థానం నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా మంత్రి పరిశీలించి సూచనలు చేశారు.
– సూర్యాపేట టౌన్, జనవరి 12
సూర్యాపేట టౌన్, జనవరి 12 : శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజనేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన త్యాగరాజ ద్విదశాబ్ది ఆరాధనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వారిలో ఆద్యుడు త్యాగరాజనేనని పేర్కొన్నారు సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేశారని కొనియాడారు. కర్ణాటక సంగీతానికి, త్యాగరాజకి విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రతియేటా సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్వాంసులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ట్యాంక్‌బండ్‌పై సౌకర్యాల గురించి ఆరా
జిల్లాకేంద్రంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై కావాల్సిన సౌకర్యాల గురించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సీటింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరగా త్వరలోనే అత్యాధునిక సీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాకర్స్, విజిటర్స్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్యాంక్‌బండ్‌పై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిషేధించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి వెంటనే చర్యలు చేపట్టాలని పోలీస్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మహాప్రస్థానం పనుల పరిశీలన
సద్దులచెరువు ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మిస్తున్న అత్యాధునిక మహా ప్రస్థానం పనులు చివరి దశకు చేరాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నిర్మాణ పనులు పరిశీలించారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశం గౌరవప్రదంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్న యోచనతో ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, అనంతుల యాదగిరిగౌడ్, అయూబ్ ఖాన్, గుండపునేని కిరణ్ పాల్గొన్నారు.