హుజూర్నగర్, మే 9 : ఈత కొడుదామనే సరదా వారి ప్రాణాల మీదకు వచ్చింది. హుజూర్‌నగర్‌లో వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగి అందులో మునిగి శుక్రవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 8మంది గొర్ల కాపర్లు వాటిని మేపేందుకు ప్రతి ఏడాది హుజూర్‌నగర్‌కు వస్తుంటారు. ఈ క్రమంలోనే నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిమట్లకు చెందిన కనుమనూరు శేఖర్ (14) దద్దనాల చెరువు సమీపంలోని బావిలో శుక్రవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు.
ఈత రాక మునిగి పోతుండగా గమనించిన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల కుంట మండలం చందాపురానికి చెందిన మోదీపురం లక్ష్మణ్ (21) శేఖర్‌ను కాపాడేందుకు బావిలో దూకాడు. మునిగిపోతున్న శేఖర్ భయంతో లక్ష్మణ్ మెడను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెం దారు. ఒడ్డున ఉన్న శేఖర్ తమ్ముడు కేకలు వేయడంతో మిగతా గొర్ల కాపర్లు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీమ్ సాయంతో మృతదేహాలను వెలికి తీయించారు. పోలీస్, రెవె న్యూ సిబ్బంది మృతుల వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.