రామగిరి, సెప్టెంబర్ 4: మైనర్లపై లైంగిక దాడి చేసిన కేసుల్లో ఒకరికి 22 ఏండ్ల జైలు, మరొకరికి 20 ఏండ్ల జైలు, జరిమా నా విధిస్తూ నల్లగొండ జిల్లా అదనపు రెండో న్యాయమూర్తి రోజారమణి గురువారం తీర్పు వెల్లడించారు. చండూరు మం డలంలో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఘనటలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2016లో కేసు నమోదు అయింది. నిందితుడిపై ఎస్సీ, పోక్సో చట్టం కింద కేసు నమో దు చేసి చార్జిషీట్ నమోదు చేశారు.
విచారణలో 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25వేల జరిమానా విధించారు. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 452 కింద ఏడాది జైలు, 5వేల జరిమా నా, ఐపీసీ సెక్షన్ 506 కింద మరో ఏడాది జైలు, రూ 5వేల జరిమానాతో కలిపి 22 ఏండ్ల జైలు, రూ.35వేల జరిమానాతోపాటు, బాధితురాలికి రూ.10లక్షల పరిహారంగా అందించాలని తీర్పు వెల్లడించారు. దేవరకొండ మండలంలో జరిగిన మరో కేసులో నిందితుడికి సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద 20 ఏండ్ల కారాగార శిక్ష, రూ. 25వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ 10లక్షల పరిహారం అందచేయాలని తీర్పులో వెల్లడించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ జిల్లాలోని 16 పోక్సో కేసుల్లో 17మందికి శిక్షలు ఖారారు అయినట్లు తెలపారు. సాక్ష్యాధారలు సేకరించి కోర్టుల్లో చార్జిషీట్ దాఖాలు చేసి నిందితులకు శిక్షపడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారి సీఐలు రమేశ్‌కుమార్, రామకృష్ణ, జవహర్లాల్, ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, ప్రాసీక్యూషన్కు సహకరించి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, చండూర్ సీఐ ఆదిరెడ్డి, దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ వెంకన్న, పీపీ వేముల రంజిత్‌కుమార్, సీడీవోలు రామాంజనేయులు, లింగయ్య, భరోసా సెంటర్ అధికారి కల్పన, నరేందర్, ఎన్ మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ అభినందించారు.