దేవరకొండ రూరల్, అక్టోబర్ 06 : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకును లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కిందపడిన మృతుల శరీరాలు చిద్రమయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.